CROWDFUNDING FOR PUCHALAPALLI SUNDARAYYA BIOPIC
ps.biopic@gmail.com
www.fb.com/ps.biopic
About Director
బాబ్జీ ...
తెలుగు సినీ పరిశ్రమలో అభ్యుదయ, ప్రగతిశీల భావాలున్న దర్శకుడు ...
కేవలం దర్శకుడు గానే కాకుండా కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే రచయితగా పలు చిత్రాలకు పనిచేశారు. ఆయన దర్శకత్వం వహించిన " నల్లపూసలు, ఎన్. టి. ఆర్ నగర్, రఘుపతి వెంకయ్య నాయుడు " వంటి చిత్రాలకు అనేక ప్రతిష్టాత్మక అవార్డులు వచ్చాయి---
"మీ శ్రేయోభిలాషి " వంటి అలోచాత్మక చిత్రాలకు ఆయన నిర్మాణ సారథిగా,ప్రాజెక్టు-కో -ఆర్డినేటర్ గా వ్యవహరించారు. 1000 కి పైగా మ్యూజిక్ ఆల్బమ్స్ ,దాదాపు 700 యాడ్ ఫిలిమ్స్, టీవీ ఎపిసోడ్స్, షార్ట్ ఫిలిమ్స్ రూపొందించారు.---
దాదాపు 3000 పాటలు రాసి వున్నారు.--
ప్రజా సమస్యలపై ఆయన రాసిన వందలాది పాటలు ప్రజల నోళ్లలో , ప్రజా గాయకుల గొంతు జీరల్లో నానుతున్నాయి. . . ప్రతిధ్వనిస్తున్నాయి. అన్ని ఆలోచనల ,అన్ని సిద్ధాంతాల ఎర్ర జెండా అభిమానులు ,వామపక్ష భావాల ప్రియతములు పాడుకునే వేగుచుక్క లాంటి పాపులర్ గీతం " ఒక్కరోజైనా....... ఒక్కసారైనా..... కమ్యూనిష్టుగా బ్రతుకు నేస్తమా...... " అను పాట ఆయన రాసినదే ... !
గతం లో జర్నలిస్ట్ గా పనిచేసిన అనుభవంతో నేటికీ ఆ కలాన్ని వదలకుండా ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా ,కాలమిస్ట్ గా పలు పత్రికలలో సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై వందలాది ఆర్టికల్స్ రాశారు.! రాస్తున్నారు.!!
వామపక్ష విద్యార్ధి ,యువజన ఉద్యమాలలో రాటుదేలిన కార్యకర్తగా, రాష్ట్ర స్థాయి నాయకుడిగా పని చేసి , ప్రజానాట్యమండలి వేదిక నుండి సినీ పరిశ్రమ లోకి వచ్చిన అభ్యుదయ భావాల దర్శకుడిగా , మంచి చిత్రాలను నిర్మిస్తూనే చిత్రపరిశ్రమలోని అనేకానేక సమస్యలపై ఉద్యమాలు , పోరాటాలు చేస్తున్నారు. ...!
చిత్రపరిశ్రమలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వామపక్ష , ప్రజాతంత్ర పోరాటాలలోను , సాంస్కృతిక ఉద్యమాలలోనూ ఇప్పటికీ క్రియాశీలంగా పాల్గొంటు తన వంతు భాగస్వామ్యాన్ని అందిస్తున్నారు.
తెలుగులో సినిమా ప్రముఖులపై రూపొందిన మొట్టమొదటి బయోపిక్ "రఘపతి వెంకయ్య నాయుడు " చిత్రానికి ఆయనే కథ , మాటలు , పాటలు , స్క్రీన్ ప్లే , దర్శకత్వం బాధ్యతలు నిర్వహించారు. అలా బయోపిక్ చిత్రాన్ని రూపొందించిన అనుభవంతో ప్రస్తుతం భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, ఆదర్శవంతుడైన మార్కిస్టు "కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య " గారి జీవితగాధను బయోపిక్ గా రూపొందించేందుకు సన్నాహాలు చేసుకుంటూ ... ఈ మహా యజ్ఞంలో క్రౌడ్ ఫండింగ్ పక్రియ ద్వారా భాగస్వాములు కావలిసిందిగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా వున్న కమ్యూనిస్ట్ ఉద్యమ అభిమానులను , మార్కిస్టు ఉద్యమ ప్రేమికులను అయన స్వాగతిస్తున్నారు ..!
ఈ సినిమా ఎందుకు తీస్తున్నామంటే ...
ప్రజల జీవితాలలో వెలుగులు నింపడం అనే మహోన్నతమైన లక్ష్యంతో ఏర్పాటు చేసుకున్న గొప్ప వ్యవస్థ " రాజకీయం" ఇది భగవద్గీత అంత గొప్పది... ఖురాన్ అంత పవిత్రమైనది ... బైబిల్ అంత పునీతమైనది ...!
అటువంటి రాజకీయ రంగాన్ని దొంగలు, దోపిడీ దారులు, లంచగొండులు, అవినీతి పరులు, మోసగాళ్లు, మాయగాళ్లు కబ్జా చేస్తున్నారు... ప్రజలను, ప్రజల ఆస్తులను, ప్రజలకు దక్కవలిసిన వనరులను, ప్రజల ప్రజాస్వాహిక హక్కులను, ప్రాథమిక హక్కులను దోచుకోవడం కోసమే " రాజకీయం" అనే అర్థాన్ని అధికారికం చేశారు. రాజకీయనాయకులను చూస్తే చాలు రాక్షసులను చూసినట్లు ప్రజలు భయపడిపోతున్నారు... అసహ్యించుకుంటున్నారు...!
దేశాన్ని, దేశ ప్రజానీకాన్ని ప్రగతిపథం వైపు, స్వేచ్ఛ పూరిత వాతావరణం వైపు నడపాల్సిన రాజకీయం రంకు నేర్చుకొని, వలువలు విప్పి, విలువల్ని కోల్పోయింది...! నేటి తరంతో పాటు రాబోయే తరం కూడా క్రమక్రమంగా రాజకీయాలకు దూరంగా బ్రతకడానికి అడుగులు వేస్తుంది... ఇది ప్రమాదకరం !
ఇటువంటి నేపథ్యంలో...
ఇటువంటి పరిస్థితులలో...
పవిత్రమైన రాజకీయాలకు నిలువెత్తు జ్ఞాపకంలా బ్రతికిన ఆదర్శమూర్తి, అభ్యుదయ స్ఫూర్తి " పుచ్చలపల్లి సుందరయ్య " గారి త్యాగపూరితమైన జీవితాన్ని, ఆయన పాటించిన రాజకీయ విలువలను, జీవితాన్ని, ఆయన చూపించిన నీతిమయ మార్గాలను, ఆయన జరిపిన సాహసోపేతమైన ప్రజా పోరాటాలను నేటి తరాలకి తెలియచేసి, రాజకీయ వ్యవస్థపై వారు కోల్పోయిన విశ్వసాన్ని మరలా వారిలో పునః ప్రతిష్టింప్పజేయాలనే లక్ష్యంతో నేనే " విప్లవయోధుడు పుచ్చలపల్లి సుందరయ్య" అనే ఈ బయోపిక్ ను రూపొందించదలిచాను ...!
ఇది ఆ మహనీయుని, మహా నాయకుని జీవితగాథకు దృశ్యరూపం.
ప్రపంచ వ్యాపితంగా వున్న అభ్యుదయవాదులు, వామపక్ష వాదులు, వామపక్ష అభిమానులు, ప్రజాస్వామ్య ప్రజాతంత్రవాదులు ప్రేమగా దాచుకునే స్ఫూర్తి చిహ్నం ...!
